మరో రీమేక్ తో రాజశేఖర్ రీ ఎంట్రీ !

రాజశేఖర్ మరోసారి రీమేక్ కథాంశంతో వెండితెరకు తిరిగి వస్తున్నారు. 2022లో వచ్చిన 'శేఖర్' తర్వాత... ఇప్పుడు తమిళంలో విజయం సాధించిన 'లబ్బర్ పంధు' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.;

By :  K R K
Update: 2025-09-22 09:44 GMT

‘ఆహుతి, మగాడు, న్యాయం కోసం, నాయకుడు, నా స్టైలే వేరు, ఎవడైతే నాకేంటి? గడ్డం గ్యాంగ్’ వంటి రీమేక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన డాక్టర్ రాజశేఖర్.. మరోసారి రీమేక్ కథాంశంతో వెండితెరకు తిరిగి వస్తున్నారు. 2022లో వచ్చిన 'శేఖర్' తర్వాత... ఇప్పుడు తమిళంలో విజయం సాధించిన 'లబ్బర్ పంధు' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు.

హరీష్ కళ్యాణ్, దినేష్ ప్రధాన పాత్రల్లో నటించి, తమిళరసన్ పంచమూర్తి దర్శకత్వం వహించిన 'లబ్బర్ పంధు' గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కి మంచి ప్రజాదరణ పొందింది. ఈ తెలుగు రీమేక్‌లో.. దినేష్ పాత్రలో రాజశేఖర్ నటించనుండగా.. హరీష్ కళ్యాణ్ పాత్రలో విశ్వదేవ్ రాచకొండ కనిపించ నున్నాడు. రాజశేఖర్ రీమేక్ సినిమాలు ఎక్కువ శాతం మంచి విజయాలు సాధించడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాజశేఖర్ కుమార్తె కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించనున్నారు. ఒక అనుభవజ్ఞుడైన నటుడు, తన కుటుంబ సభ్యులతో కలిసి స్క్రీన్‌పై రావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ రీమేక్ ఎలా ఉండబోతుందో అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. క్రికెట్ కథాంశం, రాజశేఖర్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మంచి బలాన్ని చేకూర్చే అంశాలు. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News