మెగా డేట్ కే 'వీరమల్లు'!

Update: 2025-03-14 07:27 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. పవన్ మోస్ట్ అవైటింగ్ 'హరిహర వీరమల్లు' కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. అసలు ఈనెల 28న ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడనుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. పోస్ట్ పోన్ కన్ఫమ్ అయినా 'వీరమల్లు' మళ్లీ ఎప్పుడు రాబోతుంది? అనేది పవర్ ఫ్యాన్స్ ను కలవరపెట్టిన విషయం.

ఇక 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ పై లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చేసింది టీమ్. హోళీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. గతంలో మెగాస్టార్ కి 'జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్‌లీడర్' వంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన మే 9న 'హరిహర వీరమల్లు' విడుదలకాబోతుంది.

ఈ ప్రకటనతో పవన్ అభిమానులు ఓవైపు నిరాశపడినప్పటికీ, మరోవైపు మే 9 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇంకా కొంతభాగం షూటింగ్ మిగిలి ఉంది. జనసేన ఆవిర్భావ సభ తర్వాత పవర్ స్టార్ 'వీరమల్లు' కోసం డేట్స్ కేటాయించడట.

ఎ.ఎమ్.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి తొలుత క్రిష్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఆన్‌బోర్డులోకి వచ్చాడు. ఆస్కార్ విజేత కీరవాణి స్వరపరిచిన రెండు పాటలు ఇప్పటికే బయటకు వచ్చాయి. పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది. రెండు భాగాలుగా రెడీ అవుతోన్న 'హరిహర వీరమల్లు' ఫస్ట్ పార్ట్ మే 9న విడుదలకానుంది. మొత్తంగా పవర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ హిస్టారికల్ డ్రామా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News