త్వరలో శుభవార్త చెప్పబోతున్న మెగా దంపతులు !
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట తల్లిదండ్రులయ్యేందుకు సిద్ధమవుతున్నారన్న వార్త మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.;
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ జంట తల్లిదండ్రులు కాబోతున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నప్పటికీ.. అందులో నిజం లేదు. కానీ మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట తల్లిదండ్రులయ్యేందుకు సిద్ధమవుతున్నారన్న వార్త మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. రెండు సంవత్సరాల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట త్వరలో తమ కుటుంబాలకు శుభవార్త అందించబోతున్నారట.
2017లో విడుదలైన 'మిస్టర్' చిత్రంతో తొలిసారి కలిసిన వరుణ్, లావణ్యలు.. ఆ తర్వాత 'అంతరిక్షం' సినిమా కోసం కలిసి పనిచేశారు. అదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ బయట ప్రపంచానికి తెలియకుండా ఈ ప్రేమను చాలా సంవత్సరాలు రహస్యంగా ఉంచారు. 2023లో అధికారికంగా పెళ్లి చేసుకుని తమ ప్రేమకు ముగింపు పలికారు.
పెళ్లి తరువాత లావణ్య త్రిపాఠి వెంటనే సినిమాలు చేయలేదు. గత నెలలో ఆమె 'సతిలాలివతి' అనే సినిమాను ప్రకటించింది. అంతకు ముందే ఆమె తమిళంలో 'తనల్' అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసింది. తాజాగా ఆమె గర్భవతిగా ఉన్నారన్న వార్త వెలుగులోకి రావడంతో, ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తై ఉండొచ్చని భావిస్తున్నారు. మధ్యలో ఒక వెబ్ సిరీస్‌కి కూడా ఆమె పని చేసింది.
ప్రస్తుతం లావణ్య కొంతకాలం విరామం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు. వరుస ఫ్లాప్స్ తర్వాత, ఈ పుట్టబోయే బిడ్డ వరుణ్ తేజ్ జీవితంలో సక్సెస్‌ని తీసుకు రాగలడేమో చూడాలి.