ఈ కాంబో కోసం వెరైటీ టైటిల్ ?

తాజా సమాచారం ప్రకారం రాజమౌళి యస్ యస్ యంబీ 29 చిత్రానికి ‘జెన్ 63’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ మహేష్ బాబు పాత్ర నుండి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది.;

By :  K R K
Update: 2025-08-10 01:04 GMT

సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఇండియన్ స్ర్కీన్ నంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అభిమానులు... మహేష్ 50వ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి చేసిన ఆకస్మిక ప్రకటనతో ఉత్సాహంగా ఉన్నారు. ఒక టీజర్ పోస్టర్‌ను విడుదల చేసిన రాజమౌళి, నవంబర్ 2025లో ఇప్పటివరకూ చూడని ఒక గ్రాండ్ రివీల్ ఉంటుందని అభిమానులకు హామీ ఇచ్చారు.

తాజా సమాచారం ప్రకారం రాజమౌళి యస్ యస్ యంబీ 29 చిత్రానికి ‘జెన్ 63’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ మహేష్ బాబు పాత్ర నుండి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. మహేష్ ఈ చిత్రంలో 63వ తరం వారసుడిగా, ఒక గౌరవనీయ వంశానికి చెందిన వ్యక్తి పాత్రలో కనిపించనున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, మహేష్ పాత్ర అరుదైన వస్తువుల కోసం ఒక క్వెస్ట్‌లో పాల్గొననుంది.

రాజమౌళి భారతీయ పురాణాలను, గ్లోబ్‌ట్రాటింగ్ జంగిల్ అడ్వెంచర్‌తో కలిపి ఒక భారీ స్కేల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మహేష్ బాబు బహుళ అవతారాల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 మధ్య నాటికి పూర్తవుతుందని, 2027 వేసవిలో థియేటర్లలో విడుదల కానుందని అంచనా.

Tags:    

Similar News