ఈ మూవీలో హీరోయిన్స్ ఇద్దరా?

ఈ ప్రాజెక్ట్‌లో.. త్రిష కృష్ణన్ లీడ్ హీరోయిన్‌గా, నిధి అగర్వాల్ సెకండ్ హీరోయిన్‌గా ఎంపికయినట్టు టాక్.;

By :  K R K
Update: 2025-07-06 00:27 GMT

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా ఎప్పటికీ ఆదరణ పొందే విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మొదటిసారి టాప్ రైటర్-డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కొలాబరేట్ అవబోతున్న సంగతి తెలిసిందే . ఈ కాంబినేషన్ తెలుగు సినీ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. త్రివిక్రమ్.. తనదైన మాటల మాయాజాలం, హాస్యం, ఎమోషన్స్‌తో కూడిన స్క్రిప్ట్‌లతో ప్రేక్షకులను అలరించే మాస్టర్. ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌ను కంప్లీట్ చేశారు.

ప్రస్తుతం ఆయన నటీనటులు, సాంకేతిక బృందం ఎంపికలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ షూటింగ్ ఆగస్టు చివరి వారంలో స్టార్ట్ కానుంది. ఇంకా టైటిల్ ఫైనలైజ్ కాని ఈ ప్రాజెక్ట్‌లో.. త్రిష కృష్ణన్ లీడ్ హీరోయిన్‌గా, నిధి అగర్వాల్ సెకండ్ హీరోయిన్‌గా ఎంపికయినట్టు టాక్. త్రివిక్రమ్ సినిమాల్లో రెండో హీరోయిన్ పాత్రలు పెద్దగా హైలైట్ కాకపోయినా.. ఆ పాత్రలకు కూడా ఒక ప్రత్యేక ఛార్మ్ ఉంటుంది.

ఈ సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర కూడా అలాంటిదే అని టాక్. నిధి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘హరి హర వీర మల్లు’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్’ వంటి భారీ ప్రాజెక్ట్‌లతో సూపర్ బిజీగా ఉంది. అయినప్పటికీ, త్రివిక్రమ్ సినిమాలో భాగం కావడం ఆమెకు మరో గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. మరోవైపు, త్రిష, మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ షూటింగ్‌ను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసింది. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగు సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన త్రిష.. మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లకు సైన్ చేసేందుకు రెడీగా ఉంది.

ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది. సంగీత దర్శకుడు థమన్, తన ఎనర్జిటిక్ బీట్స్‌తో ఈ చిత్రానికి జీవం పోసనున్నారు. త్రివిక్రమ్ మార్క్ హాస్యం, ఎమోషనల్ డ్రామా, వెంకటేష్‌లాంటి సీనియర్ స్టార్‌తో పాటు త్రిష, నిధిల స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించే అవకాశం ఉంది. 

Tags:    

Similar News