'తొలిప్రేమ' దర్శకుడి రీ-ఎంట్రీ!
టాలీవుడ్‌లో లవ్ స్టోరీలకి కేరాఫ్ అడ్రస్ అయిన కరుణాకరన్ చాలా కాలంగా బ్రేక్‌లో ఉన్నాడు. ‘తొలిప్రేమ, డార్లింగ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న ఆయన, గత కొంత కాలంగా హిట్ ట్రాక్‌లో లేడు. అయితే ఈ గ్యాప్‌ను ముగించి మళ్లీ దర్శకుడిగా రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు.
ఈసారి కరుణాకరన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో ఓ కొత్త సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో దిల్‌రాజు సోదరుని కుమారుడు ఆశిష్ హీరోగా నటించనున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. కథను ఆశిష్ ఎంతగానో ఇష్టపడ్డాడట. దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది.
కరుణాకరన్ సినిమా అంటే మెలోడియస్ మ్యూజిక్, ఎమోషనల్ లవ్ స్టోరీ, వైవిధ్యమైన ప్రెజెంటేషన్ ఉండడం ఖాయం. ఈ కొత్త సినిమా కూడా అదే జానర్‌లో ఉండనుందని సమాచారం. మరోవైపు ఆశిష్ ‘సెల్ఫిష్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే కథలో మార్పులు అవసరమవడంతో ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. మొత్తానికి కరుణాకరన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాడు.