నా కెరీర్ లో ఇదొక మంచి పాత్ర గా గుర్తుండి పోతుంది : రాజేంద్ర ప్రసాద్
హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్, వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చ్ 28 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ గారు మీడియాతో కొన్ని విషయాలను పంచుకున్నారు.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. "నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 సంవత్సరాలు అవుతుంది. ఈ 48 సంవత్సరాల్లో ఎన్నో పాత్ర ను పోషించాను. కానీ రాబిన్ హుడ్ లో నేను చేసిన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది.ఏజ్ తో సంబంధం లేకుండా నేను ఎన్ని రోజులు ఇలా యాక్టివ్ గా పని చేయగలుగుతున్నాను అంటే దానికి కారణం నాకు వచ్చే పాత్రలు. దానికి ఎగ్జాంపుల్ లాంటిది ఈరోజు నేను చేసిన రాబిన్హుడ్ సినిమాలో పాత్ర.రాబిన్ హుడ్ లో మళ్లీ మీరు పాత రాజేంద్రప్రసాద్ ను చూస్తారు.ప్రతి సీను కూడా నాకు పాత రోజులను గుర్తు చేశాయి. ఈ క్యారెక్టర్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
పెళ్లి పుస్తకం, ఆ ఒక్కటి అడక్కు, లేడీస్ టైలర్... ఇలా ప్రతి సినిమా కూడా భిన్నంగా ఉంటుంది. అప్పట్లో ఒకే సంవత్సరంలో 12 సినిమాలు తీసిన రోజులు కూడా ఉన్నాయి. ప్రతి సినిమా కూడా ఎంతో పెద్ద హిట్ అయ్యేది. ఎన్ని పాత్రలు చేసినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అలానే ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా కూడా ఒక ఒక మంచి సినిమా అవుతుంది అని నాకు గట్టి నమ్మకం ఉంది.
వెంకీ కుడుముల ఒక మంచి డైరెక్టర్ అవుతాడు. వెంకీని చూస్తే త్రివిక్రమే గుర్తొస్తాడు.వెంకీ లో చాలా లక్షణాలు త్రివిక్రమ్ నుంచి వచ్చాయి అనిపిస్తుంది.నితిన్ ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించాడు. అలానే రాబిన్ హుడ్ లో మా కాంబినేషన్ హిలేరియస్ గా ఉండబోతుంది. మా ఇద్దరి మధ్య టైమింగ్ అదిరిపోతుంది.సెట్స్ లో కూడా వచ్చి రాగానే ఎంతో ఆత్మీయంగా సొంత మనిషిలాగ పలకరిస్తాడు. నితిన్ ఈ సినిమా తరువాత 100 కోట్ల బడ్జెట్లో భాగం అవుతాడు అని నాకు గట్టి నమ్మకం ఉంది.శ్రీ లీల చాలా చిన్న పిల్ల అయినప్పటికీ తన నటనలో ఎంతో మెచ్యూరిటీ కనిపిస్తుంది.చాలా తక్కువ టైంలో మంచి సినిమాలు చేసింది." అని అన్నారు.