అదిరిపోయే క్లైమాక్స్ తో ‘రాజాసాబ్’
ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ కలిపి సుమారు 30 నిమిషాల పాటు నడిచే ఈ సీక్వెన్స్‌లో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని టాక్.;
ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజాసాబ్’ అభిమానుల్లో, సినీ ప్రియుల్లో ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేస్తోంది. మారుతి డైరెక్షన్లో, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా హారర్, కామెడీల మిక్స్‌తో ఓ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ప్రభాస్ సాధారణంగా చేసే యాక్షన్ రోల్స్‌కి భిన్నంగా, ఈ సినిమాలో ఆయన కొత్త లుక్, స్టైల్‌తో కనిపించబోతున్నారు.
రాజా సాబ్‌లో హైలైట్ ఏంటంటే, దాని విజువల్‌గా స్టన్నింగ్‌గా ఉండే క్లైమాక్స్. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ కలిపి సుమారు 30 నిమిషాల పాటు నడిచే ఈ సీక్వెన్స్‌లో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని టాక్. ఒక ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీ ఈ భాగాన్ని హ్యాండిల్ చేస్తోంది, సో సీజీ వర్క్ టాప్-నాచ్గా ఉండబోతోంది.
ప్రభాస్ ఈ సినిమాలో కామెడీ, థ్రిల్ మిక్స్ చేస్తూ తన వెర్సటిలిటీ చూపించబోతున్నారు. హారర్, కామెడీ కాంబోతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునే అవకాశం ఉంది. రాజా సాబ్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యే పొటెన్షియల్ ఉందని అంటున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నెలలో టీజర్ రిలీజ్ కానుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆకర్షణీయమైన స్టోరీ, విజువల్ ట్రీట్‌గా ఉండే క్లైమాక్స్, ప్రభాస్ కొత్త అవతార్‌తో రాజా సాబ్ ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్‌గా నిలుస్తోంది.