‘దురంధర్’ కు ‘రాజాసాబ్’ దారిస్తాడా ?
“ది రాజా సాబ్” జనవరి 2026కి వాయిదా పడవచ్చు. రణవీర్ సింగ్ తన తదుపరి చిత్రం “దురంధర్” పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రభాస్ వంటి పెద్ద స్టార్‌తో బాక్సాఫీస్ క్లాష్‌ను నివారించాలని కోరుకుంటున్నాడు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న “ది రాజా సాబ్” సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో జాప్యం, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఇప్పటికే పలు ఆలస్యాలను ఎదుర్కొంది. చాలా ఊహాగానాల తర్వాత, నిర్మాతలు ఇటీవల కొత్త రిలీజ్ డేట్ గా డిసెంబర్ 5 ప్రకటించారు. అయితే.. బాలీవుడ్ మీడియా నుంచి వచ్చిన తాజా నివేదికల ప్రకారం.. మరోసారి రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభాస్ మరోసారి సినిమాను వాయిదా వేయడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈసారి రణవీర్ సింగ్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఇది నిజమైతే.. “ది రాజా సాబ్” జనవరి 2026కి వాయిదా పడవచ్చు. రణవీర్ సింగ్ తన తదుపరి చిత్రం “దురంధర్” పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రభాస్ వంటి పెద్ద స్టార్‌తో బాక్సాఫీస్ క్లాష్‌ను నివారించాలని కోరుకుంటున్నాడు. ఈ కారణంగా, అతను స్వయంగా రిలీజ్ డేట్ మార్చమని కోరినట్లు సమాచారం.
ఒకవేళ “ది రాజా సాబ్” జనవరికి వాయిదా పడితే.. సంక్రాంతి 2026 లైనప్‌లో మార్పులు జరిగి.. ఆ పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తున్న పలు తెలుగు సినిమాల రిలీజ్ ప్లాన్‌లపై ప్రభావం పడవచ్చు. మారుతి దర్శకత్వంలో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న “ది రాజా సాబ్” ప్రభాస్ సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ. ఈ తాజా షెడ్యూల్ మార్పు నిజమవుతుందా లేదా అనేది రాబోయే నెలల్లో తేలనుంది.