యూరోప్ కు పయనమవుతున్న ‘ది రాజాసాబ్’ టీమ్

ఈ సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ యస్కేయన్ టీమ్ యూరప్‌కు వెళుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అక్కడ రెండు పాటలు చిత్రీకరించ నున్నారని, ఆ తర్వాత షూటింగ్ దాదాపు పూర్తవుతుందని సమాచారం అందుతోంది.;

By :  K R K
Update: 2025-10-05 08:48 GMT

'ది రాజా సాబ్' టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. మారుతి దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ హారర్ ఎంటర్‌టైనర్ జనవరి 9, 2025 న విడుదల కానుంది.

ఈ సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ యస్కేయన్ టీమ్ యూరప్‌కు వెళుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అక్కడ రెండు పాటలు చిత్రీకరించ నున్నారని, ఆ తర్వాత షూటింగ్ దాదాపు పూర్తవుతుందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, సంజయ్ దత్, సత్య, మరియు వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ యస్ సంగీతం అందిస్తున్నారు. మొట్టమొదటి సారిగా హారర్ జోనర్ లో నటిస్తున్న ప్రభాస్ కు ఈ మూవీ ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. 

Tags:    

Similar News