న్యాయపోరాటం మొదలైంది – ‘కోర్ట్’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్!
తెలుగు సినిమాల్లో కోర్ట్ రూమ్ డ్రామాలు వచ్చింది తక్కువే. తాజాగా ఆ లోటును భర్తీ చేసేలా ‘కోర్ట్’ మూవీ రాబోతోంది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వస్తోన్న సినిమా ఇది. రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 14న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
‘కోర్ట్’ ట్రైలర్ విషయానికొస్తే.. ఓ టీనేజ్ కుర్రాడు ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని పోక్సో (POCSO) కేసులో ఇరుక్కోవడం ప్రధాన ఇతివృత్తం. ఈ కేసు కారణంగా అతడు 78 రోజులు జైల్లో మగ్గిపోవాల్సి వస్తుంది. అంతటి సెన్సిటివ్ కేసు కనుక వాదించేందుకు ఎవరూ ముందుకు రారు. ఆ సమయంలో ప్రియదర్శి వాదించేందుకు సిద్ధమవుతాడు. మరి ఆ కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అనేది 'కోర్ట్' మూవీ. టెక్నికల్ గా విజయ్ బుల్గనిన్ అందించిన సంగీతం ఈ మూవీకి మరో ప్లస్ అని చెప్పొచ్చు. మొత్తంగా 'కోర్ట్' ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది.