‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో ఈ తమిళ దర్శకుడు?
రాశీ ఖన్నా ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం. ఇక తాజాగా.. తమిళ నటదర్శకుడు కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.;
‘హరిహర వీరమల్లు’ సినిమా వచ్చే వారం రిలీజ్ కాబోతున్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చుట్టూ రకరకాల ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక స్పెషల్ టీజర్‌ను విడుదల చేయవచ్చని టాక్. మరో రూమర్ ప్రకారం.. రాశీ ఖన్నా ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం. ఇక తాజాగా.. తమిళ నటదర్శకుడు కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి.. ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పూర్తి దృష్టి దక్కేలా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. కాస్టింగ్ వివరాలను మేకర్స్ ప్రకటించకుండా ఉన్నారు. ఈ సినిమాలో శ్రీలీలా ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది.