రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి సూపర్ టైటిల్ !
బోల్డ్‌గా, గ్రామీణ టచ్‌తో కూడిన ఈ టైటిల్ ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాని కొత్త డైరెక్టర్ నాగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. అది కూడా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.;
టాలీవుడ్ లో మరో స్టార్ వారసుడు హీరో ఎంట్రీ కోసం రెడీ అవుతున్నాడు. అతడి పేరు మాధవ్ రాజ్ భూపతి. ఇతగాడు మరెవరో కాదు.. మాస్ మహారాజ్ రవితేజ సోదరుడు రఘు కొడుకు. గతంలో అతని సినిమా ‘మిస్టర్ ఇడియట్’ షూట్ పూర్తయినా థియేటర్లలోకి రాకపోవడంతో అభిమానుల్లో కాస్త నిరాశ నెలకొంది. కానీ ఇప్పుడు, అతని లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘మారెమ్మ’ సరికొత్త ఊపుతో.. జోష్‌తో ముందుకు దూసుకెళ్తోంది. ఈ సినిమా టైటిల్ ఒక్కటే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తోంది.
బోల్డ్‌గా, గ్రామీణ టచ్‌తో కూడిన ఈ టైటిల్ ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాని కొత్త డైరెక్టర్ నాగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. అది కూడా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్-ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ రోజు సినిమా టీమ్ మారెమ్మ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది. ఒక దున్నపోతు బ్యాక్ గ్రౌండ్ లో హీరో ఒక కర్రపట్టుకొని అగ్రెసివ్ గా చూసే లుక్ ఆకట్టుకుంటోంది. దీని తర్వాత ఆగస్టులో ఓ షార్ట్ అండ్ స్వీట్ టీజర్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది దసరా సీజన్‌లో సినిమాని రిలీజ్ చేయడానికి టీమ్ సిద్ధంగా ఉంది. ఇది ఫెస్టివల్ వైబ్‌ని క్యాష్ చేసే అవకాశం ఉంది.
మోక్ష ఆర్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ మాధవ్ లాంచ్ కోసం ఓ రేంజ్‌లో ఖర్చు పెట్టిందని టాక్. రవితేజ లాంటి ఎనర్జిటిక్ స్టార్ కుటుంబం నుంచి వస్తున్న మాధవ్‌లో ఆ ఫైర్.. మాస్ ఎనర్జీ ఉందా? ఆడియన్స్‌తో అతను ఎలా కనెక్ట్ అవుతాడు? అనే ప్రశ్నలు అందరిలోనూ తిరుగుతున్నాయి. ‘మారెమ్మ’ ఫ్లాషీ సీన్స్, ఓవర్-ది-టాప్ యాక్షన్‌పై ఆధారపడకుండా.. సింపుల్‌గా స్ట్రాంగ్ స్టోరీతో ఆడియన్స్ హృదయాలను గెలవాలని చూస్తోందని ఇన్‌సైడ్ టాక్. గ్రామీణ నేపథ్యంలో మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డెప్త్‌తో కూడిన కథగా ఇది ఉండబోతుందని అంటున్నారు.
‘మారెమ్మ’ చిత్రం బహుశా భారీ బడ్జెట్ మూవీ కాకపోవచ్చు. కానీ మాధవ్‌ని కొత్తగా, డిఫరెంట్‌గా ఇంట్రడ్యూస్ చేయడానికి ఇదొక హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. టైటిల్, సెటప్ చూస్తే, గ్రామీణ వైబ్‌తో, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే టచ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అందరి ఫోకస్ ఒక్కటే .. రవితేజ లాంటి స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మాధవ్ ఆ స్టార్‌డమ్ అంచనాలను అందుకుని, తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేస్తాడా? అని. ఫస్ట్ లుక్, టీజర్‌తో అతని జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో చూడాలి.