స్టైల్ ఐకాన్ ఎన్టీఆర్.. వాచ్ ధర వింటే షాక్!

Update: 2025-03-11 10:47 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టైల్ ఐకాన్ అని మరోసారి నిరూపించాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తారక్ కనిపించిన తీరే దీనికి నిదర్శనం. కంఫర్ట్‌తో కూడిన క్లాస్ లుక్‌లో ఎన్టీఆర్ మెరిసిపోగా, ఆయన ధరించి వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోషల్ మీడియాలో ఇప్పుడు తారక్ వాచ్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.



ఎన్టీఆర్ చేతికి ఉన్న రిచర్డ్ మిల్లే RM 40-01 టూర్బిలియన్ మెక్‌లారెన్ స్పీడ్టెయిల్ వాచ్ ప్రత్యేకమైన చర్చకు కారణమైంది. దాదాపు రూ. 7.47 కోట్లు విలువైన ఈ అరుదైన లగ్జరీ వాచ్, ఆయన హై-ఎండ్ ఫ్యాషన్ సెలెక్షన్‌ని మరోసారి రుజువు చేసింది. ఇక.. వర్క్ ఫ్రంట్ లోకి వస్తే బాలీవుడ్ లో ‘వార్ 2‘తో పాటు.. ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్‘ సినిమాలో నటిస్తున్నాడు తారక్. ఈ సినిమాలతో పాటు ‘దేవర 2‘ కూడా పైప్ లైన్లో ఉంది.

Tags:    

Similar News