‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ తో ఫుల్ బిజీ !

అయనంక బోస్ క్లిక్ చేసిన ఓ క్యాండిడ్ ఫోటోలో శ్రీలీల గన్ పట్టుకుని టోటల్ బాస్ వైబ్‌లో కనిపిస్తోంది. ఈ షాట్‌కి ఫిదా అయిన బోస్.. “ఈ అమ్మాయి అద్భుతం..’’ అంటూ క్యాప్షన్ జోడించాడు.;

By :  K R K
Update: 2025-06-27 13:38 GMT

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతోంది. ఈ సినిమా సెట్స్ నుంచి ఓ కిల్లర్ బిహైండ్-ది-సీన్స్ మూమెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. స్టార్ సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ క్లిక్ చేసిన ఓ క్యాండిడ్ ఫోటోలో శ్రీలీల గన్ పట్టుకుని టోటల్ బాస్ వైబ్‌లో కనిపిస్తోంది. ఈ షాట్‌కి ఫిదా అయిన బోస్.. “ఈ అమ్మాయి అద్భుతం..’’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో ఫుల్ వైరల్ మోడ్‌లో ఉంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం సూపర్ స్పీడ్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో ఓ మాస్ అండ్ క్లాసీ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించ బోతున్నాడు. మరోవైపు.. శ్రీలీలా ఆయన లవ్ ఇంట్రెస్ట్‌గా స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఈ కాంబో అలరించబోతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి, ఇలాంటి గ్లింప్స్‌లు ఆ హైప్‌ని మరింత పీక్స్‌కి తీసుకెళ్తున్నాయి.

ఇంక.. శ్రీలీల ఈ ఒక్క తెలుగు సినిమాతోనే ఆగడంలేదు. ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఓ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది, అలాగే తమిళ ఇండస్ట్రీలోనూ ఓ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. ఈ అమ్మాయి కెరీర్ గ్రాఫ్ రాకెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది, అనడంలో డౌటే లేదు.. సో మొత్తానికి శ్రీలీల “ఉస్తాద్ భగత్ సింగ్”తో పాటు ఈ బాలీవుడ్, తమిళ ప్రాజెక్ట్స్‌తో శ్రీలీలా ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది.

Tags:    

Similar News