శ్రీవిష్ణు బర్త్‌డే స్పెషల్.. ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్!
By : Surendra Nalamati
Update: 2025-02-28 09:55 GMT
శ్రీవిష్ణు నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్'. ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా రెబా జాన్ నటిస్తుంది. 'సామజవరగమణ' వంటి హిట్ తర్వాత ఈ జోడీ కలిసి నటిస్తున్న సినిమా ఇది.
ఈరోజు శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా 'మృత్యుంజయ్' టీజర్ రిలీజయ్యింది. టైటిల్ టీజర్‌ను గమనిస్తే నటీనటులతో పాటు శ్రీవిష్ణుని ఇన్వెస్టిగేటర్‌గా, ఖైదీగా రెండు షేడ్స్ లో చూడొచ్చు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.