శివాజీ కొత్త సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం !
ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ మెదక్ జిల్లాలోని ధారిపల్లి గ్రామంలో ప్రారంభమైంది.;
టాలీవుడ్ యాక్టర్ శివాజీ ఇటీవల విడుదలైన "కోర్ట్" చిత్రంలో ప్రతినాయక పాత్రలో తనదైన ముద్రవేశాడు. ప్రస్తుతం నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న "దండోరా" అనే కొత్త చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ మెదక్ జిల్లాలోని ధారిపల్లి గ్రామంలో ప్రారంభమైంది. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివాజీ పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.
శివాజీ సుమారు 25 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొననున్నాడు. సామాజికంగా వివక్షలకు, వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే కథాంశంతో "ధండోరా" చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో నవదీప్, నందు, రవి కృష్ణ, మనిక చిక్కల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మురళికాంత్, సమాజంలోని అసమానతలను తెరపై చక్కగా ఆవిష్కరించేందుకు ఈ కథను రూపొందిస్తున్నారు. మరి ‘దండోరా’ చిత్రం శివాజీకి ఇంకెంత పేరు తెస్తుందో చూడాలి.