ఇతడి టాలెంట్ అంతా వేస్ట్ అవుతోంది !
"దసరా" చిత్రంలో విలన్‌గా పరిచయమై... మంచి పేరు తెచ్చుకున్నాడు షైన్ టామ్ చాకో . అయితే ఆ తరువాత అతను నటించిన సినిమాల్లోని పాత్రలు అతని స్థాయికి తగ్గట్టు పడలేదు.;
టాలీవుడ్ ఇతర వుడ్స్ నుంచి అనేక మంది ప్రతిభావంతులైన నటులను తీసుకొచ్చింది. అటువంటి వారిలో షైన్ టామ్ చాకో ఒకడు. మలయాళ సినిమాల్లో అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చాకోని.. తెలుగులో మాత్రం సరైన విధంగా ఉపయోగించుకోవడం లేదు.
"దసరా" చిత్రంలో విలన్‌గా పరిచయమై... మంచి పేరు తెచ్చుకున్నాడు షైన్ టామ్ చాకో . అయితే ఆ తరువాత అతను నటించిన సినిమాల్లోని పాత్రలు అతని స్థాయికి తగ్గట్టు పడలేదు. "రంగబలి" చిత్రంలో నాగశౌర్యకు ప్రతినాయకుడిగా కనిపించినా... ఆ పాత్ర అంతగా ప్రభావం చూపలేకపోయింది. అనంతరం "దేవర: పార్ట్ 1" లో వచ్చిన అతని పాత్రకి ఏమంతగా ప్రాధాన్యం లేకపోవడంతో ... అతని టాలీవుడ్ జర్నీకి హోప్ ఫుల్ వే దొరకలేదు.
తాజాగా "డాకూ మహారాజ్", "రాబిన్ హుడ్" వంటి చిత్రాలలో నటించినా.. అవి షైన్ టామ్ చాకో కి క్రేజ్ తీసుకురాలేకపోయాయి. ముఖ్యంగా "రాబిన్ హుడ్" లో విక్టర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించినా... అది అంతగా ఆకట్టుకోలేదు. పైగా, ఆ పాత్రకికూడా సరైన బలం లేకపోవడం అతనిపై విమర్శలకు దారి తీసింది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో అతనికి రావాల్సిన స్థాయిలో పాత్రలు రావడం లేదు. రొటీన్ పాత్రలు కాకుండా, అతని నటనను పరీక్షించే, అతని సామర్థ్యాన్ని బయటపెట్టే కథలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాక, హేమచంద్ర డబ్బింగ్ కూడా అతని కోసం అంతగా సెట్ కాలేదనే విమర్శలు ఉన్నాయి. కాబట్టి, భవిష్యత్తులో మరింత మంచి సినిమాలు ఎంచుకుని, షైన్ టామ్ చాకో తన అసలైన ప్రతిభను చూపించగలడని ఆశిద్దాం.