నెక్స్ట్ మూవీ కోసం స్ట్రాటజీ మార్చుతాడా?
శేఖర్ కమ్ముల భవిష్యత్ ప్రాజెక్టుల కోసం తన స్ట్రాటజీని రీ-ఎవాల్యూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరింత జాగ్రత్తగా తన నెక్స్ట్ మూవ్‌ను ప్లాన్ చేస్తున్నాడు.;
డైరెక్టర్ శేఖర్ కమ్ముల లేటెస్ట్ ఫిల్మ్ “కుబేర” మిశ్రమ ఫలితాలను సాధించింది. తెలుగులో డీసెంట్‌గా ఆడినప్పటికీ, ఇతర భాషల్లో.. ముఖ్యంగా తమిళ వెర్షన్‌లో, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో ఇది పెద్ద నిరాశను మిగిల్చింది. మొత్తంగా, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వలేకపోయింది. శేఖర్ కమ్ములకు పాన్-ఇండియా సక్సెస్ కోసం ఎన్నో ఆశలున్నాయి. సినిమాకు మంచి క్రిటికల్ అక్లైమ్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వసూళ్లు ఆయన ఆశించిన స్థాయిలో రాలేదు.
దీంతో.. శేఖర్ కమ్ముల భవిష్యత్ ప్రాజెక్టుల కోసం తన స్ట్రాటజీని రీ-ఎవాల్యూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరింత జాగ్రత్తగా తన నెక్స్ట్ మూవ్‌ను ప్లాన్ చేస్తున్నాడు. పాన్-ఇండియా అప్పీల్ కోసం తన ఫిల్మ్‌మేకింగ్ స్టైల్‌ను మార్చడానికి బదులు.. శేఖర్ కమ్ముల తన కోర్ స్ట్రెంగ్త్‌కి.. సింపుల్, ఎమోషన్ తో నడిచే కథలు, సోల్‌ఫుల్ అండ్ పాపులర్ మ్యూజిక్‌తో రిచ్‌గా ఉండే సినిమాలకు.. తిరిగి వస్తాడని భావిస్తున్నారు.
తన నెక్స్ట్ స్క్రిప్ట్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునే పాటలకు శేఖర్ కమ్ముల ఎక్కువ స్కోప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇది ఆయన గత సక్సెస్‌లలో ఒక ట్రేడ్‌మార్క్. ఇప్పటికే ఆయన నటుడు నానితో కొత్త ప్రాజెక్ట్ కోసం చర్చలు మొదలుపెట్టాడు. కానీ ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదు. స్క్రిప్ట్‌ను జాగ్రత్తగా రాసుకోవడానికి కమ్ముల ఎక్కువ సమయం తీసుకోనున్నాడు. సాధారణంగా ఆయన స్క్రిప్టింగ్, ప్రీ-ప్రొడక్షన్‌కు దాదాపు ఏడాది సమయం తీసుకుంటాడు. ఈ గ్యా్ప్.. నాని ప్రస్తుత కమిట్‌మెంట్స్‌తో.. ముఖ్యంగా “ది ప్యారడైస్” షూటింగ్ లో పాల్గొనడానికి సరిగ్గా సరిపోతుంది.