మళ్లీ లవ్ స్టోరీ చేయబోతున్న శేఖర్ కమ్ముల?
ప్రస్తుతం శేఖర్ రెండు స్క్రిప్ట్‌లపై వర్క్ చేస్తున్నాడు. ఒకటి నాని కోసం, మరొకటి అదిరిపోయే ఒక కొత్త తరం లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ కోసం యంగ్ ఫేసెస్‌ని కాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.;
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లేటెస్ట్ ఫిల్మ్ ‘కుబేర’ బాగానే హిట్ అయింది. ధనుష్, నాగార్జున నటించిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. శేఖర్ కమ్ముల సాధారణంగా తన స్క్రిప్ట్‌లు రాయడానికి చాలా సమయం తీసుకుంటాడు. అలాగే షూటింగ్ పూర్తి చేయడానికి కూడా ఎక్కువ టైమ్ తీసుకుంటాడు. ప్రస్తుతం శేఖర్ రెండు స్క్రిప్ట్‌లపై వర్క్ చేస్తున్నాడు.
ఒకటి నాని కోసం, మరొకటి అదిరిపోయే ఒక కొత్త తరం లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ కోసం యంగ్ ఫేసెస్‌ని కాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ రాయడానికి ఒక సంవత్సరం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే కాస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అతడు నానీకి ఒక ప్లాట్ నెరేట్ చేసి.. ఆల్రెడీ అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు.
కానీ నానీకి ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో శేఖర్ ప్రాజెక్ట్‌కి టైమ్ కేటాయించడం కుదరడం లేదు. అయినప్పటికీ, శేఖర్, నానీ సినిమా స్క్రిప్ట్‌తో పాటు లవ్ స్టోరీ స్క్రిప్ట్‌ని కూడా పూర్తి చేస్తాడట. ప్రస్తుతానికి ఏ ప్రాజెక్ట్ ముందు రోల్ అవుతుందనేది క్లారిటీ లేదు. శేఖర్ కమ్ముల రాబోయే సినిమాలను ఆసియన్ సునీల్ నిర్మించబోతున్నట్టు టాక్.