మెగా మూవీలో విలన్ గా సంజయ్ దత్!
బాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. వీరిలో వెటరన్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఉన్నాడు. ఇప్పటికే రామ్ ‘డబుల్ ఇస్మార్ట్‘లో నటించిన సంజయ్ దత్, ప్రభాస్ ‘రాజాసాబ్‘లోనూ కీలక పాత్రలో సందడి చేయబోతున్నాడు. లేటెస్ట్ గా సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు‘లో నటించడానికి సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
సాయి తేజ్ ప్రధాన పాత్రలో రోహిత్ కె.పి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ‘సంబరాల ఏటి గట్టు‘ రూపొందుతుంది. ఈ సినిమాకోసం సిక్స్ ప్యాక్ బాడీతో సాయితేజ్ చేసిన మేకోవర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ‘హనుమాన్‘ ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విలన్ రోల్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ పాత్రకు సంజయ్ దత్ సరిగ్గా సరిపోతాడని భావించాడట డైరెక్టర్. రెమ్యునరేషన్ ఎక్కువైనా అతన్నే ఏరికోరి తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకోసం హైదరాబాద్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో సంజయ్ కూడా పాల్గొంటాడట. ఈ చిత్రంలో సాయిదుర్గా తేజ్ కి జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల వంటి భారీ తారాగణం కనిపించబోతుంది. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ ఈ ప్రాజెక్ట్ కి మరో ప్లస్ పాయింట్. ఈ ఏడాది దసరా కానుకగా ‘సంబరాల ఏటి గట్టు‘ రిలీజ్ కానుంది.