సామ్ ‘శుభం’ చిత్రం రిలీజయ్యేది అప్పుడే !
సమంత రుత్ ప్రభు ప్రారంభించిన కొత్త నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ తమ తొలి ప్రాజెక్ట్ ‘శుభం’. ఈ చిత్రాన్ని 2025 మే 9న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.;
సరైన కంటెంట్ దొరికినప్పుడు నటీనటులు నిర్మాతలుగా మారడం ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత కూడా ఇప్పుడు అదే బాట పట్టింది. ఆమె తన స్వంత నిర్మాణ సంస్థ ద్వారా ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. సమంత రుత్ ప్రభు ప్రారంభించిన కొత్త నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ తమ తొలి ప్రాజెక్ట్ ‘శుభం’. ఈ చిత్రాన్ని 2025 మే 9న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
హారర్ ను, కామెడీని వినూత్నంగా మిళితం చేస్తూ తెరకెక్కుతున్న ‘శుభం’ చిత్రంలో... ప్రేక్షకులను భయపెట్టే సరదా సంఘటనలతో అలరించే పాత్రలు ఉంటాయి. అనూహ్య మలుపులు, చురుకైన హాస్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సమ్మర్ లో కుటుంబంతో కలిసి చూడదగిన వినోదభరిత చిత్రంగా ‘శుభం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో యువ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి పెర్ఫార్మెన్సెస్ ఇప్పటికే మంచి బజ్‌ను సృష్టిస్తున్నాయి. వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరేజో సంగీతం చిత్రానికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. హాస్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను సమపాళ్లలో మేళవించి, ‘శుభం’ చిత్రాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
"వినోదభరితమైన, ఒరిజినల్ కథలు చెబుతామని మా విజన్‌ను శుభం మూవీ ప్రతిబింబిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రపంచంతో పంచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది," అని నిర్మాత సమంత తెలిపింది. మొత్తానికి, భావోద్వేగాలు, భయం, నవ్వు .. అన్నింటినీ కలగలిపిన ఒక వెరైటీ హారర్ కామెడీగా ‘శుభం’ ప్రేక్షకులను బాగా థ్రిల్ చేయబోతోందని నిర్మాతలు చెబుతున్నారు.