అమ్మడి ఆశలు ఆడియాశలు అయ్యాయి

Update: 2025-05-03 07:02 GMT

పూజా హెగ్డే ఒకానొక టైమ్ లో తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటి గా పేరు పొందింది. టాలీవుడ్ లోని టాప్ హీరోలందరితో ఆమె నటించింది. ఆమె డిమాండ్ చేసిన పారితోషికం నిర్మాతలు సమర్పించాల్సి వచ్చేది. కానీ కొంత కాలం గా వరుస ఫ్లాపులతో ఆమె క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. అనేక తెలుగు సినిమాల నుంచి ఆమెను తప్పించారు. ఇటీవలి కాలంలో తెలుగు చిత్రాల్లో ఆమె కనిపించలేదు.

పూజా హెగ్డేకు సూర్య నటించిన రెట్రో పై భారీ ఆశలుండేవి. ఈ చిత్రంలో ఆమె భిన్నమైన పాత్రలో నటించింది. అయితే లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా కు ప్రతికూల ఫలితం దక్కింది. దీంతో ఆమె ఆశలు అడియాస లయ్యాయి. రెట్రో ప్రమోషన్ సమయంలో ఆమె మాట్లాడుతూ, త్వరలో ఓ తెలుగు సినిమా చేయనున్నట్టు చెప్పింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉంటుందన్నారు.

ప్రస్తుతం ఆమె విజయ్ నటిస్తున్న జననాయకన్ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఇక రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. అలాగే పూజా హెగ్డే ప్రస్తుతం కాంచన 4 చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. మరి పూజా హెగ్డే కెరీర్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News