అంత పారితోషికం అందుకుందా?
సాయిపల్లవి లేటెస్ట్ తెలుగు మూవీ “తండేల్” కోసం రూ. 3.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. కానీ “రామాయణం” కోసం ఆమె రెండు భాగాలకు కలిపి రూ. 12 కోట్లు అంటే ఒక్కో భాగానికి రూ. 6 కోట్లు పొందనుంది.;
టాలెంటెడ్ సౌత్ హీరోయిన్ సాయి పల్లవి.. తన అసాధారణ నటనా ప్రతిభతో వరుస హిట్ సినిమాలతో జనాల మనసులు గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఆమె తెలుగు సినిమాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు సైన్ చేయడం తగ్గించేసి.. బాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె హ్యాండిల్ చేస్తున్న హై-ప్రొఫైల్ హిందీ సినిమాల లిస్ట్‌లో భారీ ఎపిక్ చిత్రం “రామాయణం” హైలైట్‌గా నిలుస్తోంది. నితేష్ తివారీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న “రామాయణం” రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. అదే సమయంలో ఈ చిత్రానికి సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది, ఇది సినీ లవర్స్‌లో హైప్‌ను పెంచేస్తోంది. రణ్‌బీర్ కపూర్, యశ్ లాంటి టాప్ స్టార్స్ ఈ సినిమా కోసం రూ. 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారని అందరికీ తెలిసిన టాక్. కానీ ఇక్కడ సర్‌ప్రైజ్ ఏంటంటే.. సాయి పల్లవి కూడా తన సాధారణ రెమ్యూనరేషన్‌తో పోలిస్తే దాదాపు డబుల్ అమౌంట్‌ను ఈ సినిమా కోసం అందుకోబోతోందట. ఆమె లేటెస్ట్ తెలుగు మూవీ “తండేల్” కోసం రూ. 3.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. కానీ “రామాయణం” కోసం ఆమె రెండు భాగాలకు కలిపి రూ. 12 కోట్లు అంటే ఒక్కో భాగానికి రూ. 6 కోట్లు పొందనుంది. ఇది ఆమె కెరీర్‌లో ఇప్పటివరకూ అత్యధిక పారితోషికంగా నిలుస్తోంది.
“రామాయణం” ఒక పౌరాణిక ఎపిక్ మూవీ, గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ భారీ స్కేల్‌లో తెరకెక్కుతోంది. సాయి పల్లవి ఈ చిత్రంలో సీతాదేవిగా కీలక పాత్ర పోషిస్తుండటంతో, నిర్మాతలు ఆమెకు ఆ పాత్రకు తగ్గట్టుగా ప్రీమియం పారితోషికాన్ని ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఈ మూవీలో ఆమె నటన, లుక్, ఎమోషనల్ డెప్త్ గురించి ఇప్పటినుంచే బజ్ క్రియేట్ అవుతోంది. సాయి పల్లవి ఈ సినిమాతో బాలీవుడ్‌లో కూడా తన మార్క్ చూపించడానికి రెడీ అవుతోందని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.