ఈ ఇద్దరూ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు !
తాజాగా.. వీరిద్దరూ ముంబైలో ఒక రెస్టారెంట్‌లో కలిసి లంచ్ చేయడం మరోసారి వార్తల్లో నిలిచింది. ‘సికందర్’ గ్రాండ్ రిలీజ్ అనంతరం రష్మిక ముందుగా అక్కడికి చేరుకోగా.. విజయ్ మాత్రం వెనుక వైపు నుంచి లోపలికి వెళ్లాడు.;
నేషనల్ క్రష్ రష్మికా మందన్న, రౌడీ హీరో విజయ్ దేవరకొండల ప్రేమ విషయంపై కొంత కాలంగా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా.. వీరిద్దరూ ముంబైలో ఒక రెస్టారెంట్‌లో కలిసి లంచ్ చేయడం మరోసారి వార్తల్లో నిలిచింది. ‘సికందర్’ గ్రాండ్ రిలీజ్ అనంతరం రష్మిక ముందుగా అక్కడికి చేరుకోగా.. విజయ్ మాత్రం వెనుక వైపు నుంచి లోపలికి వెళ్లాడు. అయితే, ఇది జనం దృష్టికి రాక తప్పలేదు. ఇద్దరూ వేరువేరుగా వచ్చినా, ఒకేచోట ప్రవేశించడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
వీరిద్దరూ కొద్దిసేపు ప్రైవేట్ లంచ్ ఎంజాయ్ చేసి కాసేపటికి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. గతంలోనూ వీరి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధంపై అనేక వార్తలు వచ్చాయి. ‘గీత గోవిందం’ సినిమాకే మొదలైన వీరి రిలేషన్‌షిప్ రూమర్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, ఇటీవల ‘సికందర్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ విషయాన్ని మరోసారి హైలైట్ చేశాయి.
‘రష్మికకు తనకు వయసులో తేడా ఉన్నా.. అది పెద్ద సమస్య కాదని చెప్పిన సల్మాన్.. ఈమెకు పెళ్లి అయ్యి, పిల్లలు కలిగిన తర్వాత కూడా కలిసి నటిస్తాను. ఈమె అంగీకారం పొందుతాను’.. అంటూ హాస్యంగా వ్యాఖ్యానించాడు. ఈ మాటలు వినగానే, రష్మిక, విజయ్‌ల పెళ్లి విషయంపై చర్చలు మళ్లీ ఊపందు కున్నాయి. అయితే, వీరిద్దరూ ఎప్పటిలానే ఎలాంటి స్పందన ఇవ్వకుండా మౌనం పాటించారు.