రుక్సార్ vs ఫొటోగ్రాఫర్లు – ట్రైలర్ లాంఛ్‌లో గందరగోళం!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎంత గ్లామర్‌గా ఉన్నా, ఎంత టాలెంట్ చూపించినా, అప్పుడప్పుడూ కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం కామన్. తాజాగా, రుక్సార్ థిల్లాన్ పేరు కూడా ఇలాంటి వివాదంలోకి వచ్చేసింది.
‘దిల్ రూబా’ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా జరిగిన ఒక ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈవెంట్‌లో రుక్సార్ తన ఫొటోలు తీయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫొటోగ్రాఫర్లు అడిగినప్పటికీ కొన్ని ఫోజులు ఇవ్వడానికి నిరాకరించింది. 'ఈ డ్రస్‌లో నేను కంఫర్ట్‌గా లేను, వదిలేయండి' అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇది మామూలుగానే ఉంటే బాగుండేది. కానీ తర్వాత ఫొటోగ్రాఫర్లు ఆమెను గ్రూప్ ఫోటో షూట్‌లో పక్కకు తొలగించారు. దీంతో రుక్సార్ బాధపడి తన అసంతృప్తిని బహిరంగంగా చెప్పింది. 'కంఫర్ట్‌గా లేకపోయినా ఫొటోలు తీయడమేనా? ఇక్కడున్న అమ్మాయిలు దీన్ని అంగీకరిస్తారా?' అంటూ నిలదీసింది.
ఇదే ఘటనపై ఫొటోగ్రాఫర్లు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. ఇది మొదటిసారి కాదని, రుక్సార్ ప్రవర్తన మీడియాపై అసహనం కలిగించేలా ఉంటోందని అంటున్నారు. ఒకవేళ మీడియా కవరేజ్ అవసరం లేదని హీరోయిన్లు భావిస్తే, వాళ్ల ఫొటోలు తీయాల్సిన అవసరం తమకూ లేదని చెబుతున్నారు. అయితే ఈ ఘటన పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.