సరికొత్త నేషనల్ క్రష్ ఈమేనా?
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఆమెనే కొత్త “నేషనల్ క్రష్” గా ఫిక్స్ చేసింది. అయితే, ఈ పాపులారిటీకి రుక్మిణి ఏమాత్రం పొంగిపోకుండా, చాలా సింపుల్‌గా ఉంది.;
ఇన్నేళ్లుగా.. రష్మిక మందన్నను 'నేషనల్ క్రష్'గా అంతా ముద్దుగా పిలుచుకున్నారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ప్లేస్‌ను ఇంకొకరు ఆక్రమిస్తున్నారు. ఆమే రుక్మిణి వసంత్. 'కాంతార: చాప్టర్ 1'లో యువరాణి పాత్రలో మెరిసిన ఈ కన్నడ బ్యూటీ, తన అందంతో, అద్భుతమైన నటనతో, ముఖ్యంగా తన క్యారెక్టర్‌లో ఉన్న సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేసింది.
అంతకుముందు 'సప్త సాగరదాచే ఎల్లో' కన్నడ సినిమాతో క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్నా, “కాంతార: చాప్టర్ 1” ఆమెను ఒక్కసారిగా పాన్-ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లింది. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఆమెనే కొత్త “నేషనల్ క్రష్” గా ఫిక్స్ చేసింది. అయితే, ఈ పాపులారిటీకి రుక్మిణి ఏమాత్రం పొంగిపోకుండా, చాలా సింపుల్‌గా ఉంది.
"చాలా మంది నన్ను నేషనల్ క్రష్ అంటున్నారు. అది వినడానికి హ్యాపీగా ఉంది, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోను. కాంప్లిమెంట్స్ అనేవి టెంపరరీ, టైమ్‌తో పాటు అవి మారిపోతాయి కదా," అని ఆమె చాలా కూల్‌గా చెప్పింది.
సినిమాల విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్.టి.ఆర్ చేయబోయే “డ్రాగన్” సినిమాలో రుక్మిణి వసంత్ నే హీరోయిన్‌గా నటించబోతున్నట్లు టాక్. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినా, ఆమె ఎంపిక దాదాపుగా ఖరారైందట. అంతేకాకుండా, యష్ పాన్-ఇండియా బిగ్గీ “టాక్సిక్” లో కూడా ఆమె ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతోంది.