'రాబిన్‌హుడ్' ట్రైలర్ ఆరోజే!
'రాబిన్‌హుడ్' మూవీ ట్రైలర్ ఈరోజే విడుదలవ్వాల్సి ఉంది. అసలు 'రాబిన్‌హుడ్' ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం విడుదల చేస్తున్నట్టు.. అందుకు ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్' ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టు ఓ ఫన్నీ వీడియోతో ఆమధ్య అనౌన్స్ చేశారు హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుమల. కానీ యదావిధిగా అనివార్య కారణాలతో 'రాబిన్‌హుడ్' ట్రైలర్ వాయిదా పడింది.
ఈ వాయిదా విషయాన్ని కూడా 'గ్రోక్' నే చెప్పమంటే.. అది హీరో, డైరెక్టర్ కి ఇచ్చిన ఘాటైన రిప్లై, ఆ తర్వాత మార్చి 23న 'రాబిన్‌హుడ్' ట్రైలర్ రిలీజ్ కు మంచి ముహూర్తమని 'గ్రోక్' చెప్పిన విజువల్స్ తో ఈ సినిమా పోస్ట్‌పోన్ విషయాన్ని కొత్తగా చెప్పారు. పైగా మార్చి 23న 'రాబిన్‌హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేతులమీదుగా ఈ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారట. ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.