బాక్సాఫీస్ ను కొల్లగొట్టనున్న 'రాబిన్‌హుడ్'

Update: 2025-03-23 14:57 GMT

ఈనెలలో టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ మూవీ 'రాబిన్‌హుడ్'. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన 'రాబిన్‌హుడ్' ప్రచార చిత్రాలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్‌గా మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Full View

నితిన్-వెంకీ కుడుముల గత చిత్రం 'భీష్మ' తరహాలోనే ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్ గా 'రాబిన్‌హుడ్' రాబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇక రాబిన్‌హుడ్ అంటేనే పెద్దోళ్ల దగ్గర దోచుకుని పేదోళ్లకు పెడతాడు. ఈ సినిమాలోనూ అలాంటి ఓ మెస్సేజ్ ను చూపించబోతున్నాడు వెంకీ కుడుమల.

హీరో నితిన్ స్వాగ్, హీరోయిన్ గా శ్రీలీల స్టైల్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ, చివరిలో డేవిడ్ వార్నర్ స్పెషల్ కేమియో 'రాబిన్‌హుడ్' ట్రైలర్ లో హైలైట్స్. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్. మొత్తంగా ట్రైలర్ తో 'రాబిన్‌హుడ్'పై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పొచ్చు.

Tags:    

Similar News