రెజీనా 20 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ !

తెలుగులో ‘శివ మనసులో శ్రుతి’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రెజీనా.. ‘రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నీవు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, షాకిని డాకిని’ లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కి ఫేవరెట్ అయిపోయింది.;

By :  K R K
Update: 2025-08-22 00:41 GMT

అందాల హీరోయిన్ రెజీనా కస్సాండ్రా సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. స్టార్టింగ్ నుంచి లేటెస్ట్ ప్రాజెక్ట్స్ వరకూ, డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో అడాప్ట్ అవుతూ కెరీర్‌ని రాక్ చేస్తోంది. తెలుగులో ‘శివ మనసులో శ్రుతి’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రెజీనా.. ‘రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నీవు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, షాకిని డాకిని’ లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కి ఫేవరెట్ అయిపోయింది.

ఆ తర్వాత, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీల్లోకి ఎక్స్‌పాండ్ అయి.. ఫుల్-ఆన్ పాన్-ఇండియన్ యాక్టర్‌గా రూట్ సెట్ చేసుకుంది. చాలెంజింగ్ రోల్స్‌ని కూడా కూల్‌గా హ్యాండిల్ చేస్తూ.. అజిత్ మూవీ ‘విడా ముయర్చి’ లో విలన్ రోల్‌లో కనిపించి.. బాలీవుడ్‌లో ‘జాట్’ మూవీలోనూ నెగటివ్ రోల్ తో అదరగొట్టేసింది.

ఓటీటీలో ‘రాకెట్ బాయ్స్’ (సోనీలివ్) లో ఆమె పెర్ఫార్మెన్స్‌కి క్రిటిక్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు మూడో దశాబ్దంలోకి అడుగుపెడుతూ, రెజీనా తమిళ పొలిటికల్ థ్రిల్లర్, హిందీ వెబ్ సిరీస్, తెలుగు సినిమలోనూ.. ఇలా విభిన్న భాషల్లో ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

Tags:    

Similar News