'RC16'.. ఢిల్లీ షెడ్యూల్ కోసం రెడీ!

Update: 2025-03-03 03:04 GMT

'RC16'.. ఢిల్లీ షెడ్యూల్ కోసం రెడీ!గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'RC16' షూటింగ్ ప్రణాళిక ప్రకారం వేగంగా కొనసాగుతోంది. ఈ మూవీని క్రికెట్, కుస్తీ వంటి క్రీడలకు సంబంధించిన కథాంశంగా స్పోర్ట్స్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నాడట డైరెక్టర్ బుచ్చబాబు. ఇప్పటికే మైసూర్, హైదరాబాద్ లలో కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఢిల్లీ షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది.

ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాలని యోచిస్తోంది. అయితే భద్రతా కారణాల వల్ల ఇటీవలి కాలంలో పార్లమెంట్ ప్రాంగణంలో షూటింగ్‌కు అనుమతులు కఠినతరమయ్యాయి. అయినప్పటికీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఫారసుతో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది.

అలాగే దేశ రాజధానిలోని ప్రఖ్యాత జామా మసీద్ వద్ద కూడా కొన్ని సన్నివేశాలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రంజాన్ అనంతరం ఇందుకు సంబంధించిన అనుమతులు పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మళ్లీ కాకినాడ, బుచ్చిబాబు సొంత ఊరైన ఉప్పాడ తదితర ప్రాంతాల్లోనూ 'RC16' షూటింగ్ ప్లాన్ చేశారట.

వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. ఇతర కీలక పాత్రల్లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు వంటి వారు సందడి చేయబోతున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత రెహమాన్ స్వరపరుస్తున్న పూర్తిస్థాయి తెలుగు కమర్షియల్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా లేదా దీపావళికి విడుదల చేయాలనే సన్నాహాలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News