యంగ్ టైగర్ చిత్రంలో నేషనల్ క్రష్ ?
దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఎన్టీఆర్ సినిమా “డ్రాగన్” కోసం కూడా రష్మిక పేరును పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో రష్మిక మెయిన్ హీరోయిన్ కాదు. ఆమెకు ఒక స్పెషల్ రోల్ ఇవ్వాలని దర్శకుడు ఆలోచిస్తున్నారట.;
టాలీవుడ్ నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అగ్రనాయిక. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అందుకున్న ఏకైక దక్షిణాది నటి రష్మిక అంటే .. అందులో ఆశ్చర్యం లేదు. దీంతో ఆమెను పాన్ ఇండియా బడ్జెట్ సినిమాల్లో హీరోయిన్‌గా గానీ లేదా స్పెషల్ అపిరియన్స్ కోసం గానీ తీసుకోవాలన్న ఆడియన్స్ డిమాండ్ పెరిగిపోతోంది.
అయితే రష్మిక, పాన్ ఇండియా చిత్రాలకన్నా ముందుగా విజయ్ దేవరకొండ సినిమాకే ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ‘వీడీ14’ కోసం సైన్ చేసింది. ఈ చిత్రానికి ‘శ్యామ్ సింఘ రాయ్’ దర్శకుడు రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె ఇతర అవకాశాలను పక్కన పెట్టేసింది. ఇదిలా ఉండగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఎన్టీఆర్ సినిమా “డ్రాగన్” కోసం కూడా రష్మిక పేరును పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో రష్మిక మెయిన్ హీరోయిన్ కాదు. ఆమెకు ఒక స్పెషల్ రోల్ ఇవ్వాలని దర్శకుడు ఆలోచిస్తున్నారట. ఈ చిత్రానికి కథానాయికగా రుక్మిణి వాసంత్‌ను ఫైనల్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇప్పటివరకు ఎన్టీఆర్‌తో రష్మిక జోడీకట్టలేదు. “డ్రాగన్” సినిమాతో ఆమె అతనితో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కొచ్చే అవకాశముంది. అయితే ఇది అతిథి పాత్ర మాత్రమే. ఇటీవల గోకర్ణ ప్రాంతంలో ఎన్టీఆర్ పాల్గొన్న యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ లండన్ ట్రిప్‌లో ఉన్నారు. తిరిగొచ్చిన తర్వాత మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబి నేషన్‌లో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక మందన్నా అనే స్టార్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తే అది సినిమాకు ఇంకొంత క్రేజ్ తీసుకురావడం ఖాయం.