29 అంటే నాకే నమ్మశక్యంగా లేదు : రష్మికా మందన్న
వయస్సు పెరుగుతున్నకొద్దీ నా ఆనందం మరింత పెరుగుతోంది! 29 ఏళ్లవుతున్నాననే విషయం నాకే ఇంకా నమ్మశక్యం కావడం లేదు!” అని రష్మిక తెలిపింది.;
ఇండియన్ స్ర్కీన్ పై టాప్ మోస్ట్ హీరోయిన్ గా రష్మిక మందన్న తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటూనే ఉంది. “యానిమల్,” “ఛావా,” “పుష్ప 2” వంటి పాన్-ఇండియా హిట్‌లతో తన క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఆమె, ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన “సికందర్” సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, రష్మిక పాపులారిటీపై ఎటువంటి ప్రభావం చూపలేదు.
ఏప్రిల్ 5న ఆమె 29వ వసంతంలోకి అడుగుపెట్టనుంది రష్మిక. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ సెల్ఫీ షేర్ చేస్తూ, వయస్సు పెరుగుతుండడం తనకు ఎంతగానో ఆనందాన్నిస్తున్న విషయాన్ని వెల్లడించింది. ”ఇది నా పుట్టినరోజు నెల! పెద్దవాళ్లయినకొద్దీ జన్మదినాలను సరిగ్గా జరుపుకోవాలనే ఉత్సాహం తగ్గిపోతుందని అంటారు.. కానీ నా విషయంలో అలా ఏమాత్రం అనిపించడం లేదు. వయస్సు పెరుగుతున్నకొద్దీ నా ఆనందం మరింత పెరుగుతోంది! 29 ఏళ్లవుతున్నాననే విషయం నాకే ఇంకా నమ్మశక్యం కావడం లేదు!” అని రష్మిక తెలిపింది.
ముందుగా, ఆమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి నటిస్తున్న “కుబేరా” చిత్రంలో కనిపించనుంది. అలాగే, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న “ది గర్ల్‌ఫ్రెండ్” చిత్రంలో కూడా రష్మిక కీలక పాత్ర పోషించనుంది. రష్మికకు ముందున్న సినిమాలు ఆమె కెరీర్‌ను మరింత గ్లోరియస్‌గా మార్చబోతున్నాయి.