ఈ ఏడాది మూడు సినిమాలున్నాయి !

రష్మిక మందన్నాకు ఈ ఏడాది థియేటర్లలో విడుదలకు సిద్ధమైన మూడు సినిమాలు ఉన్నాయి, ఇందులో ఒక బాలీవుడ్ చిత్రమూ ఉంది.;

By :  K R K
Update: 2025-04-18 00:55 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బ్లాక్‌బస్టర్ తర్వాత బ్లాక్‌బస్టర్ అందిస్తూ దూసుకెళ్ళింది. అయితే ఆమె తాజా బాలీవుడ్ భారీ చిత్రం "సికందర్" ఘోరంగా పరాజయం పాలయినప్పటికీ.. రష్మికకు మాత్రం ఏమీ నష్టం జరగలేదు. ఆ సినిమా ప్రధానంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరో సల్మాన్ ఖాన్ లకే బాగా ఎఫెక్ట్ అయింది. రష్మిక మందన్నాకు ఈ ఏడాది థియేటర్లలో విడుదలకు సిద్ధమైన మూడు సినిమాలు ఉన్నాయి, ఇందులో ఒక బాలీవుడ్ చిత్రమూ ఉంది.

ప్రస్తుతం ఆమె తన తదుపరి పాన్-ఇండియా ప్రాజెక్ట్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న "కుబేర" కోసం సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమం వచ్చే వారం ప్రారంభం కానుంది. ధనుష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. "కుబేర" సినిమా జూన్‌లో విడుదల కానుంది.

ఇంకొవైపు.. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న "ది గర్ల్‌ఫ్రెండ్" అనే ఫిమేల్ సెంట్రిక్ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాక, రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి "థామా" అనే హారర్-కామెడీ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం 2025 డిసెంబరులో విడుదల కానుంది ఈ మూడు సినిమాలు రష్మిక మందన్నా స్టార్ డమ్ ను మరింత పెంచనున్నాయి.

Tags:    

Similar News