ప్రతీ చిన్న ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి : రష్మికా మందన్న
ఒమన్‌లోని ఓ రిసార్టులో తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది రష్మిక. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో సముద్ర తీరంలో నృత్యం చేస్తూ కనిపించింది.;
ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా ‘డియర్ డైరీ’ అంటూ తన మనసులోని మాటలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడం రష్మిక మందన్నాకు అలవాటు. 29వ పుట్టినరోజు తర్వాత కూడా ఆమె ఇదే పద్ధతిని కొనసాగించింది. ‘ప్రతి చిన్న ఆనందాన్ని కూడా జరుపుకోవాలి. అందులో చిన్నదా పెద్దదా అనే తేడా ఉండదు’.. అంటూ తన అభిమానులకి, ఫాలోవర్లకి సందేశం ఇచ్చింది.
ఒమన్‌లోని ఓ రిసార్టులో తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది రష్మిక. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో సముద్ర తీరంలో నృత్యం చేస్తూ కనిపించింది. ఈ వీడియో ప్రత్యేకంగా ఆమె కోసం ఏర్పాటు చేసిన బీచ్ పార్టీకి సంబంధించినదిగా తెలుస్తోంది.
తన పుట్టినరోజున జరిగిన విషయాలను రష్మిక ఇలా వర్ణించింది. ‘ఉదయానే లేచి లెగ్ వర్కౌట్ చేశాను. (ఇటీవలి కాలంలో కాలు గాయమైంది కాబట్టి అది చాలా ముఖ్యమైంది) ఆ తర్వాత బాగా అలసిపోయినందుకు మసాజ్ తీసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ చేశాను, కాసేపు నిద్రపోయాను. పుట్టినరోజు శుభాకాంక్షలు పంపినవారికి అందరికీ రిప్లై ఇచ్చాను. రాత్రికి డిన్నర్ పార్టీ చేసుకున్నాం. అలా ఈ ప్రత్యేకమైన రోజు గడిచిపోయింది..’ ఇంకా.. తాను చేసిన ఈ పోస్టులో రష్మిక ఇలా రాసింది.
‘డియర్ డైరీ.. హూ.. ఎక్కడ్నుంచి మొదలెట్టాలి.. ఒకసారి ఈ కోట్‌తో మొదలెడదాం.. చిన్న విజయం అనేది ఉండదు. ప్రతి విజయం కూడా పెద్దదే. ఉత్సవంగా జరుపుకోవాలి. నీ వయస్సు ఒక్క సంవత్సరంతో పెరిగింది. జరుపుకో. నీకు చిన్నపాటి పోకెట్ మనీ వచ్చిందా.. జరుపుకో. నీవు పెళ్లి చేసుకున్నావా.. జరుపుకో. గాయం తర్వాత డాక్టర్ నిన్ను తిరిగి పరుగెత్తమంటాడా.. జరుపుకో (ఇది నాకైతే త్వరలో జరగాలి అని ఆశ). నువ్వు పరీక్ష రాసి పాస్ అయ్యావా .. ఉత్సవంగా జరుపుకో.. ప్రతి చిన్న విజయం ఆనందించు – ఎందుకంటే చిన్నదేదీ ఉండదు.”
ప్రస్తుతం రష్మిక చేతిలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న “కుబేరా,” అలాగే “ది గర్ల్‌ఫ్రెండ్,” బాలీవుడ్ చిత్రం “థామా” వంటి సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ 2025 ద్వితీయార్ధంలో విడుదల కానున్నాయి.