‘పెద్ది’ షూటింగ్ కు చెర్రీ కొద్ది రోజులు బ్రేక్ !

సినిమా షూటింగ్ షెడ్యూల్ ముగిసిన వెంటనే.. చెర్రీ కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించాడు. అది వేసవి ఎండల వల్ల కాదు. ఇతర కార్యక్రమాల కోసం. రామ్ చరణ్ వచ్చే వారం లండన్‌కు వెళతాడు.;

By :  K R K
Update: 2025-05-01 00:34 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా "పెద్ది" షూటింగ్‌ షెడ్యూల్ ను ఇటీవల పూర్తి చేశాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాను బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది, రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్‌లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ముగిసిన వెంటనే.. చెర్రీ కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించాడు. అది వేసవి ఎండల వల్ల కాదు. ఇతర కార్యక్రమాల కోసం. రామ్ చరణ్ వచ్చే వారం లండన్‌కు వెళతాడు. అక్కడ మేడమ్ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటాడు.

ఆ తర్వాత, రాయల్ ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రాలో "ఆర్‌ఆర్‌ఆర్" సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రదర్శన కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమాల తర్వాత, రామ్ చరణ్ తన భార్య, కూతురితో కొద్ది రోజులు సెలవు తీసుకోవాలని ప్లాన్ చేశారు. ఆయన మే మూడో వారం తర్వాత సినిమా షూటింగ్‌కు తిరిగి వస్తారు. ఈ సినిమా ప్రోగ్రెస్ గురించి రామ్ చరణ్ చాలా సంతోషంగా ఉన్నాడు.

Tags:    

Similar News