వావ్... వాటే కాంబో !
చరణ్ తన తర్వాతి చిత్రాన్ని ధనుష్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మల్టీ స్టారర్ మూవీ కాదనీ, పూర్తిగా ధనుష్ డైరెక్ట్ చేసే సినిమా అని టాక్.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 40వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఊహించని రీతిలో ఆకట్టుకుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆయన తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ఉండబోతోంది. అయితే, తాజాగా మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
చరణ్ తన తర్వాతి చిత్రాన్ని ధనుష్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మల్టీ స్టారర్ మూవీ కాదనీ, పూర్తిగా ధనుష్ డైరెక్ట్ చేసే సినిమా అని టాక్. ‘పా పాండి, రాయన్’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తన మార్క్ చూపించిన ధనుష్.. ఇప్పుడు రామ్ చరణ్ కోసం ఓ మాస్ యాక్షన్ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా?’ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత.. ధనుష్ మళ్లీ ఉత్సాహంతో తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ కథలలో భావోద్వేగాలే ప్రధానంగా ఉంటాయి. అలాగే.. ఆయన కథన శైలి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. రామ్ చరణ్ మాస్ ఎనర్జీ, ధనుష్ నేరేటివ్ స్టైల్ కలిసి వస్తే.. తెలుగు-తమిళ పరిశ్రమలకు ఇది ఓ ప్రత్యేకమైన మైలు రాయిగా మారే అవకాశముంది. ఇద్దరూ ప్రయోగాత్మకమైన సినిమాలను ఎంచుకునే హీరోలు కావడంతో.. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉండే ఛాన్స్ ఉంది. మరి ఈ కాంబో మూవీ నిజంగా వస్తుందో లేదో