స్పోర్ట్స్ కూలీగా రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రం కథ విషయానికొస్తే.. ఇదొక వినూత్నమైన స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుందట. స్పోర్ట్స్ డ్రామా అంటే ఒకే ఒక ఆట చుట్టూ తిరుగుతుంటాయి. కానీ ఈ సినిమాని పలు రకాల ఆటల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ బుచ్చిబాబు.
క్రికెట్, కుస్తీ, కబడ్డీ.. ఇంకా పలు ఆటలు ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అన్ని స్పోర్ట్స్ లోనూ ఎక్స్ పెర్ట్ గా స్పోర్ట్స్ కూలీ పాత్రలో కనిపించబోతున్నాడట. అంటే ఏ ఆట ఆడేవాళ్లు డబ్బులు ఇస్తే.. ఆ ఆటను ఆడటం అన్నమాట. ఈ క్యారెక్టర్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.
ఈ మూవీలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంటే.. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న స్పీడు చూస్తుంటే ఈ ఏడాదిలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయట.