పూరీ - సేతుపతి చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ?
ఇప్పుడు మరో హాట్ నేమ్ ఈ సినిమాలో వినిపిస్తోంది. ఆమె రాధికా ఆప్టే. అనుభవం, నటనలో విలక్షణత ఉన్న ఈ బ్యూటీకి ఈ సినిమాలో ఓ బలమైన పాత్ర ఉందట.;
ఒకప్పుడు స్టార్ హీరోలకు స్టార్‌డమ్ ఇచ్చిన డైరెక్టర్‌గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ముద్ర ప్రతి సినిమాలో స్పష్టంగా కనిపించేది. అయితే గత కొంత కాలంగా పూరి మార్క్ మిస్ ఫైర్ అవుతోంది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ లాంటి చిత్రాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. వీటన్నిటి తర్వాత దర్శకుడు మళ్లీ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈసారి పాన్ ఇండియా స్థాయిలో విజయ్ సేతుపతి హీరోగా ఓ కొత్త సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్. షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నటీనటుల ఎంపిక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన పాత్రకు బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ముద్దుగుమ్మ, సీనియర్ హీరోయిన్ టబు ఎంపికైనట్టు అధికారికంగా ప్రకటించారు.
ఇప్పుడు మరో హాట్ నేమ్ ఈ సినిమాలో వినిపిస్తోంది. ఆమె రాధికా ఆప్టే. అనుభవం, నటనలో విలక్షణత ఉన్న ఈ బ్యూటీకి ఈ సినిమాలో ఓ బలమైన పాత్ర ఉందట. ఇది ఆమెకు కూడా విభిన్నమైన ప్రయోగమే అవుతుంది. రజినీకాంత్, బాలకృష్ణ లాంటి సూపర్ స్టార్స్ పక్కన నటించిన రాధికా.. ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించనుందో అనేది ఆసక్తికర విషయం.
మొత్తానికి పూరి జగన్నాథ్ మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారి విజయ్ సేతుపతి, టబు, రాధికా ఆప్టే వంటి నటులతో కలిసి పాన్ ఇండియా ప్రేక్షకుల మన్ననలు పొందాలనుకుంటున్నాడు. మరి ఈ సారి సక్సెస్ కోసం పూరీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాడో చూడాలి.