ఒడిశా వీధుల్లో ప్రియాంక చోప్రా!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి 'SSMB 29' సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అధికారికంగా సినిమా వివరాలు వెల్లడించకపోయినా, కీలకమైన అప్‌డేట్స్ ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఇటీవలే సినిమా సెట్స్ నుండి ఓ సీన్ లీక్ కావడం ఫ్యాన్స్ లో భారీ అంచనాలు పెంచింది. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ మూవీ లొకేషన్ గురించి.. ఆమె షూటింగ్ లో పాల్గొంటున్న విషయం గురించి వరుస వీడియోలను, ఫోటోలను ఇన్ స్టా స్టోరీస్ లో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం SSMB29 షూటింగ్ ఒడిశాలో జరుగుతుందని.. ఆమె పోస్ట్ చేసిన విజువల్స్ తో మరోసారి స్పష్టమైంది.
ప్రియాంక చోప్రా విమానం నుండి తీసిన ఏరియల్ వ్యూ, ఒడిశా వీధుల్లో ఆమె షేర్ చేసిన ఫోటోలు, మరింతగా సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటికే ఒడిశాలో షూటింగ్‌లో పాల్గొనగా, ఇప్పుడు ప్రియాంక చేరడంతో వారంతా కలిసి కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.