కెన్యాలోని నేషనల్ పార్క్ లో షూటింగ్ !

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కెన్యాకు వెళ్లిన ఫ్లైట్ ఫొటోస్ షేర్ చేసి.. కెన్యాలో లభించే ఇండియన్ స్నాక్ 'కెన్యన్ చివ్డా'ను ఫన్నీగా పోస్ట్ చేసింది.;

By :  K R K
Update: 2025-08-28 13:50 GMT

మహేష్ బాబు ఇంట్లో గణేష్ ఉత్సవాలకు హాజరు కాకపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఎట్టకేలకు క్లియర్ అయింది. నమ్రతా శిరోద్కర్ ఇటీవల ఫ్యామిలీతో కలిసి ఫెస్టివల్ ఫొటోస్ షేర్ చేస్తూ.. మహేష్‌ను ఎంతగా మిస్ అయ్యామో చెప్పారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా లేటెస్ట్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌కు సమాధానం దొరికింది. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కెన్యాకు వెళ్లిన ఫ్లైట్ ఫొటోస్ షేర్ చేసి.. కెన్యాలో లభించే ఇండియన్ స్నాక్ 'కెన్యన్ చివ్డా'ను ఫన్నీగా పోస్ట్ చేసింది.

దీంతో, 'గ్లోబ్‌ట్రాటర్' (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ ఈస్ట్ ఆఫ్రికాలో అధికారికంగా స్టార్ట్ అయినట్లు కన్ఫర్మ్ చేసింది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా తొలిసారి జోడీ కడుతున్నారు. కెన్యాలోని ఓ నేషనల్ పార్క్‌లో గ్రాండ్ అడ్వెంచర్ సీక్వెన్స్‌లను రిచ్ వైల్డ్‌లైఫ్ మధ్య షూట్ చేయనున్నారు.

మొదట గత నెలలో షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా, కెన్యాలో రాజకీయ అల్లర్ల కారణంగా ఆలస్యం అయింది. ఇప్పుడు యూనిట్ ముందుకు సాగుతుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అధికారిక టైటిల్‌తో పాటు సినిమా స్కేల్‌ను చూపించే స్పెషల్ గ్లింప్స్‌ను నవంబర్‌లో రివీల్ చేస్తామని రాజమౌళి ప్రామిస్ చేశారు. 

Tags:    

Similar News