త్వరలో తిరిగి వస్తా : కేతికా శర్మ
తన నోట్‌లో.. కేతిక ఖచ్చితమైన కారణం చెప్పకుండా కొంత కాలం డిజిటల్ ప్రపంచం నుంచి దూరంగా ఉంటానని తెలిపింది. అయితే.. త్వరలో తిరిగి వస్తానని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చింది.;
అందాల హీరోయిన్ కేతిక శర్మ సోషల్ మీడియా నుంచి కొంత కాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇటీవల శ్రీ విష్ణు నటించిన “సింగిల్” సినిమాతో సక్సెస్ సాధించిన ఈ బ్యూటీ.. ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో తన బ్రేక్ గురించి ప్రకటన చేసింది.
తన నోట్‌లో.. కేతిక ఖచ్చితమైన కారణం చెప్పకుండా కొంత కాలం డిజిటల్ ప్రపంచం నుంచి దూరంగా ఉంటానని తెలిపింది. అయితే.. “త్వరలో తిరిగి వస్తా,” అని నోట్ లో రాసి ఫ్యాన్స్ కు హామీ ఇచ్చింది. కేతిక శర్మ తన 3.7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ను గ్లామరస్ ఫోటోషూట్స్‌తో ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటుంది.
వృత్తి పరంగా.. కేతిక కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా తమిళ సినిమాలపై దృష్టి సారించింది. ఈ ఏడాది ఆమె “రాబిన్‌హుడ్” సినిమాలో “అడి ధా సర్‌ప్రైసు” అనే ఐటమ్ సాంగ్‌తో సంచలనం సృష్టించింది. “సింగిల్” సినిమాతో హిట్ కొట్టింది. ప్రస్తుతం ఆమె తన కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.