ప్రభాస్ ‘రాజాసాబ్’ టీజర్ అదిరిపోయింది

ప్రభాస్ ఈ సినిమాలో టోటల్ వింటేజ్ వైబ్‌లో, కలర్‌ఫుల్ అవతార్‌లో సూపర్ చార్మింగ్‌గా, సరదాగా కనిపిస్తున్నాడు.;

By :  K R K
Update: 2025-06-16 06:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న “ది రాజా సాబ్” మూవీ టీజర్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు టీజర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. ఈ టీజర్ హారర్, ఫాంటసీ, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లను కలగలిపిన ఒక రంగుల మిశ్రమంలా అనిపిస్తుంది. ప్రభాస్ ఈ సినిమాలో టోటల్ వింటేజ్ వైబ్‌లో, కలర్‌ఫుల్ అవతార్‌లో సూపర్ చార్మింగ్‌గా, సరదాగా కనిపిస్తున్నాడు. ఇది అతని గత ఇంటెన్స్ యాక్షన్ రోల్స్ నుంచి ఫుల్ యూ-టర్న్ తీసుకున్నట్టుగా ఉంది. ఫ్యాన్స్‌కి ఈ కొత్త ప్రభాస్ లుక్ ఖచ్చితంగా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది.

Full View

ఈ టీజర్ హారర్ ఫాంటసీ జానర్‌లో రూట్ అయినప్పటికీ, కామెడీ, యాక్షన్, గ్లామర్ ఎలిమెంట్స్‌ను సమర్థవంతంగా బ్లెండ్ చేస్తూ మల్టీ- డైమెన్షనల్ వైబ్‌ను క్రియేట్ చేసింది. టీజర్ ఓపెనింగ్ సీన్‌లో సంజయ్ దత్ క్యారెక్టర్ ఒక ఒంటరి, డస్కీ బంగ్లాలో కనిపిస్తూ స్పూకీ మూడ్‌ను సెట్ చేస్తాడు. అక్కడి నుంచి హారర్-కామెడీ టెంప్లేట్‌లోకి స్మూత్‌గా స్విచ్ అవుతుంది. భయానక సీన్స్‌ను ప్రభాస్ తన సిగ్నేచర్ కామిక్ టైమింగ్‌తో బ్యాలెన్స్ చేస్తూ టీజర్‌ను లైవ్‌లీగా మార్చాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్, సరదా ఎక్స్‌ప్రెషన్స్ ఫ్యాన్స్‌ను ఊరిస్తాయి.

రొమాన్స్ ట్రాక్స్ ఈ టీజర్‌లో హైలైట్‌గా నిలుస్తాయి. ప్రభాస్‌తో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌లతో రొమాంటిక్ సీన్స్ మాస్ ఆడియన్స్‌ను డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తాయి. మాళవిక మోహనన్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో గ్లామరస్ రోల్‌తో డెబ్యూ చేస్తోంది, ఇది ఆమెకు బిగ్ బ్రేక్ అవుతుందని భావిస్తోంది. డైరెక్టర్ మారుతి ప్రభాస్‌ను ఒక ఫన్, క్రౌడ్-ప్లీజింగ్ అవతార్‌లో ప్రెజెంట్ చేయడంపై పూర్తి ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తున్నాడు. ఇది ప్రభాస్ యాక్షన్-హెవీ, సీరియస్ రోల్స్ నుంచి రిఫ్రెషింగ్ చేంజ్‌గా అనిపిస్తుంది. ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు జోష్‌ను యాడ్ చేస్తూ విజువల్స్‌కు ఎక్స్‌ట్రా ఎనర్జీ ఇస్తోంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది ‘ది రాజాసాబ్ ’.


Full View

Tags:    

Similar News