ప్రభాస్ లుక్ ఆ మూవీ కోసమేనా?
ప్రభాస్ లుక్స్ లో స్పష్టమైన ట్రాన్స్‌ఫర్మేషన్ కనిపిస్తోంది. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఈ మేకోవర్ వెనుక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఉన్నాడని అంటున్నారు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల యూరప్‌లో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, ఆరోగ్య సమస్యకు చికిత్స చేయించుకుని భారత్‌కు తిరిగి వచ్చాడు. రిటర్న్ అయిన వెంటనే అతడు “ది రాజా సాబ్” షూటింగ్‌ను తిరిగి స్టార్ట్ చేశాడు. అలాగే.. ఐకానిక్ ఫిల్మ్ “బాహుబలి” ప్రొడక్షన్ స్టార్ట్ అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన రీయూనియన్ ఈవెంట్‌లో కూడా పబ్లిక్‌గా కనిపించాడు.“ది రాజా సాబ్” సెట్స్ నుంచి, అలాగే బాహుబలి రీయూనియన్ నుంచి వచ్చిన ఫొటోలు, వీడియోల్లో ప్రభాస్ చాలా ఫిట్‌గా, షార్ప్‌గా కనిపిస్తున్నాడు.
ప్రభాస్ లుక్స్ లో స్పష్టమైన ట్రాన్స్‌ఫర్మేషన్ కనిపిస్తోంది. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఈ మేకోవర్ వెనుక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఉన్నాడని అంటున్నారు. ప్రభాస్‌తో వంగా తన నెక్స్ట్ ఫిల్మ్ “స్పిరిట్” ను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ తో విజయ్ దేవరకొండ , ‘కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్ ’, ‘యానిమల్’ తో రణబీర్ కపూర్ లతో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ రాబట్టిన వంగా.. ప్రభాస్‌ను కూడా టాప్ ఫిజికల్ ఫామ్‌లోకి తీసుకురావాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
“స్పిరిట్” షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మొదలవనుంది. వంగా.. ప్రభాస్ రోల్ కోసం పూర్తి డెడికేషన్, ఫిజికల్ ఇంటెన్సిటీ తీసుకురావాలని కోరు కుంటున్నారట. ఈ సలహాను సీరియస్‌గా తీసుకున్న ప్రభాస్, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు పూనుకున్నట్లు సమాచారం. మరి ప్రభాస్ లుక్ బిగ్ స్ర్కీన్ పై ఇంకెంత పవర్ ఫుల్ గా ఉంటుందో చూడాలి.