పవర్ ప్యాక్డ్ ట్రైలర్.. హైప్ పెంచుతున్న ‘దిల్ రూబా’!

Update: 2025-03-06 12:57 GMT


Full View

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘దిల్ రూబా’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా మొదట ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవ కానుగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల మార్చి 14న రిలీజ్ చేయనున్నారు. ‘క’ మూవీ హిట్ అయిన తర్వాత కిరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.



దానికి తగ్గట్టుగానే మేకర్స్ ప్రమోషన్స్‌ను దూకుడుగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్, మూడు పాటలు విడుదల కాగా, తాజాగా ట్రైలర్ ను విడుదల చేసారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. హీరో కిరణ్ అబ్బవరం లవర్ బాయ్ లా మెస్మరైజ్ చేస్తున్నాడు. తన ఆటిట్యూడ్, స్వాగ్ తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. హీరో కిరణ్, హీరోయిన్ రుక్సర్ మధ్య లవ్ స్టొరీ కొత్తగా అనిపిస్తుంది. మొత్తంగా విశ్వ కరుణ్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రెయిలర్ పవర్ పాక్డ్ గా ఉంది.

Tags:    

Similar News