మూడేళ్ళ తర్వాత తెలుగులో మళ్ళీ పూజా హెగ్డే !

ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమా సైన్ చేసాను. షూటింగ్ డేట్స్ ఫిక్స్ అయ్యాక.. పూర్తి వివరాలు మీకు చెబుతాను," అంటూ హింట్ ఇచ్చింది.;

By :  K R K
Update: 2025-04-18 02:23 GMT

సూర్య ‘రెట్రో’ మూవీలోని 'కనిమా' అంటూసాగే పాటలో తన ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్‌తో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన పూజా హెగ్డే... 2022 తరువాత తెలుగు సినిమాలకు ఎందుకు గ్యాప్ ఇచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అలాగే, త్వరలో రానున్న తన కొత్త తెలుగు ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకుంది.

"నాకు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనిపించింది. కేవలం సినిమా కోసం సినిమా చేయడం నాకు ఇష్టం లేదు. ఒక మంచి పాత్ర, బలమైన కథ కావాలి అనిపించింది. ఆ ఎగ్జయిట్మెంట్ లేని ప్రాజెక్ట్‌లు చేయాలనుకోలేదు. ఇదే అసలు కారణం, ఇంకేమీ లేదు," అని పూజా వివరించింది. ఈ గ్యాప్ సమయంలో కూడా తెలుగు సినిమాల నుంచి ఆఫర్లు వచ్చాయంటూ ఆమె చెబుతోంది.

ప్రస్తుతం తమిళం, హిందీ భాషలలో పూజాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ ఏడాది మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని ఆమె నిర్ణయించుకుంది. తన రాబోయే తెలుగు సినిమాపై మాట్లాడుతూ పూజా నవ్వుతూ చెప్పింది.. ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమా సైన్ చేసాను. షూటింగ్ డేట్స్ ఫిక్స్ అయ్యాక.. పూర్తి వివరాలు మీకు చెబుతాను," అంటూ హింట్ ఇచ్చింది.

ఇటీవల పూజా షాహిద్ కపూర్‌తో కలిసి నటించిన 'దేవా' హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో వరుణ్ ధవన్ సరసన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రంలో కనిపించనుంది. ఇక మే 1న విడుదల కానున్న 'రెట్రో' అనే గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాతో పూజా మరోసారి ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. 1980ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. సూర్య, జోజు జార్జ్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Tags:    

Similar News