1000 మంది డ్యాన్సర్స్ తో ‘పెద్ది’ సాంగ్

ప్రస్తుతం.. చిత్ర బృందం మైసూర్‌లో రామ్ చరణ్‌పై 1000 మంది డాన్సర్లతో ఒక గ్రాండ్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తోంది.;

By :  K R K
Update: 2025-08-28 00:38 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ విజువల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. భారతీయ సినిమా రంగంలో అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ప్రమోషనల్ కంటెంట్ అద్భుతంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి.

ప్రస్తుతం.. చిత్ర బృందం మైసూర్‌లో రామ్ చరణ్‌పై 1000 మంది డాన్సర్లతో ఒక గ్రాండ్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తోంది. సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఈ పాటకు అదిరిపోయే మాస్ ట్యూన్ ఇచ్చారని, దర్శకుడు బుచ్చిబాబు సానా రామ్ చరణ్‌ని, తెలుగు నేటివ్ స్వాగ్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేలా ప్లాన్ చేశారని నిర్మాతలు చెబుతున్నారు.

ఈ విజువల్ స్పెక్టాకిల్‌ను జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇది అందరికీ కనువిందుగా ఉంటుందని నిర్మాతలు అంటున్నారు. స్క్రిప్ట్, అన్ని ఎమోషన్స్ ప్రజంటేషన్ అద్భుత స్థాయిలో ఉంటాయని చెబుతున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఇప్పటివరకు చూడని స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియా స్పెక్టాకిల్ 2026 మార్చి 27న విడుదల కానుంది. థియేటర్లలో అత్యంత అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తామని, ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందని నిర్మాతలు హామీ ఇస్తున్నారు.

Tags:    

Similar News