'మిరాయ్' కోసం హోంబలే ఫిల్మ్స్
తేజ సజ్జ 'మిరాయ్' చిత్రానికి పరభాషల నుంచి భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పటికే హిందీలో ఈ సినిమాని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేస్తుండగా.. కన్నడ వెర్షన్ కోసం హోంబలే ఫిల్మ్స్ రంగంలోకి దిగింది.;
తేజ సజ్జ 'మిరాయ్' చిత్రానికి పరభాషల నుంచి భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పటికే హిందీలో ఈ సినిమాని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేస్తుండగా.. కన్నడ వెర్షన్ కోసం హోంబలే ఫిల్మ్స్ రంగంలోకి దిగింది. ఈ చిత్రాన్ని కన్నడలో హోంబలే సంస్థ భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది.
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో తేజ సజ్జ ఓ సూపర్ యోధుడుగా కనిపించనున్నాడు. 'హనుమాన్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించిన తేజ, ఈ సినిమాతో ఆ హైప్‌ను మరింత పెంచాలని చూస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ విలన్ గా నటించడం మరో హైలైట్‌గా మారింది. హీరోయిన్‌గా రితికా నాయక్ నటించగా, సంగీతాన్ని గౌర హరి అందించాడు.
ఈరోజు 'మిరాయ్' ట్రైలర్ రాబోతుంది. మధ్యాహ్నం 12:06 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. మొత్తంగా.. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న 'మిరాయ్'.. 'హనుమాన్' స్థాయిలో విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.