రాజకీయాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాడా?
తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల మీద ఓవర్ టైమ్ పని చేస్తున్నారు. తనవైపు నుంచి ఎలాంటి ఆలస్యం ఉండకుండా సినిమా షూటింగ్‌లు, కమిట్మెంట్లు పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారు.;
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఏదైన ఒక అంశంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి మిగిలినవి పక్కన పెట్టే అలవాటు ఉందని తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టడంతో ఆయన సినీ కమిట్ మెంట్స్ పక్కకు వెళ్ళాయి. దీని ప్రభావంతో ‘హరి హర వీర మల్లు’, ‘ఓజీ’ వంటి చిత్రాలు ఆటోమేటిగ్గా ఆలస్యమయ్యాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. పవన్ కళ్యాణ్ తన పెండింగ్ సినిమాలన్నింటినీ త్వరగా పూర్తిచేసే దిశగా వేగంగా పనిచేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల మీద ఓవర్ టైమ్ పని చేస్తున్నారు. తనవైపు నుంచి ఎలాంటి ఆలస్యం ఉండకుండా సినిమా షూటింగ్‌లు, కమిట్మెంట్లు పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారు. పవన్ తాత్కాలికంగా రాజకీయాల నుండి విరామం తీసుకున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఒకేసారి పలు ప్రాజెక్టులపై పని చేస్తున్నారు. ఇప్పటికే ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘ఓజీ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మరో కొన్ని వారాల్లో పూర్తవుతుందని సమాచారం.
అనంతరం ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతుంది. ఇకపై పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్టుపై దృష్టి సారించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే, పవన్ కళ్యాణ్‌కు మిగిలిన మూడు పెండింగ్ సినిమాలు త్వరలోనే పూర్తవుతాయన్నమాట. దీంతో ఆయన సినిమా కమిట్మెంట్లు అన్నీ త్వరలోనే పూర్తయే అవకాశముంది.