‘ఓజీ’ షూట్ పూర్తి చేసిన పవర్ స్టార్ !
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నుంచి ఓ స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ తన షూటింగ్ పార్ట్ ను ఫుల్‌గా కంప్లీట్ చేసినట్లు అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన పెండింగ్ ప్రాజెక్ట్‌లను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ.. టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ మూవీ గురించి హాట్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ గత కొంతకాలంగా జోరుగా సాగుతోంది. ఇప్పుడు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నుంచి ఓ స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ తన షూటింగ్ పార్ట్ ను ఫుల్‌గా కంప్లీట్ చేసినట్లు అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.
ఈ పోస్టర్‌లో పవన్ సూపర్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. వర్షంలో తడిసిన బ్యాక్‌డ్రాప్‌తో.. డేంజరస్ వైబ్‌ను పంచుతూ, స్టైల్‌కు స్టైల్ తోడైన ఈ లుక్ అభి మానులను ఫుల్ జోష్‌లోకి తీసుకెళ్లింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. అభిమానులు దీన్ని చూసి ఫిదా అవుతున్నారు. సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమా.. ఇప్పుడు పోస్ట్-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఒక ఐకానిక్ రోల్‌గా ఈ సినిమా ఉండబోతుందని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా, పవన్‌ను ఓ కొత్త డైమెన్షన్‌లో చూపించబోతోందని టాక్.
ఇక రిలీజ్ డేట్ విషయానికొస్తే, ‘ఓజీ’ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఇప్పటినుంచే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తంగా, ‘ఓజీ’ మూవీ కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది.